ఒకే ఒక్క వీడియో తో ట్రోల్ల్స్ కు చెక్ పెట్టిన టీడీపీ

SMTV Desk 2019-03-22 11:48:56  tdp, chandrababu,

2014 ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాగా గుర్తుండి పోయిన హామీల్లో రాజధాని అమరావతిని ఎవ్వరు అభివృద్ధి చేయని విధంగా సింగపూర్ తరహా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.అక్కడ ఎంత వరకు పనులు పూర్తయ్యాయో తెలీదు కానీ అమరావతి మరియు పోలవరం ప్రాజెక్టులపై ఇతర పార్టీల అభిమానులు వేసిన ట్రోల్ల్స్ అన్ని ఇన్ని కాదు అందుకు తగ్గట్టు గానే బాబు గారు కూడా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్లు రకరకాల నమూనాలు ఒకానొక సందర్భంలో అమరావతి డిజైన్ కోసం టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళిని కూడా రంగంలోకి దింపి చేసిన హడావుడి కూడా అంతా ఇంతా కాదు.

అదే విధంగా పోలవరం ప్రాజెక్టు విషయానికి వచినట్టైతే అక్కడ పనులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చూడండి అంటూ ఒక పక్క టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే మరో పక్క ఇతర పార్టీల అభిమానులు అసలు అవి నిజమైనవి కావని గ్రాఫిక్స్ మాయాజాలమని ఓ రేంజ్లో ట్రోల్ల్స్ వేసేవారు,అలాగే అమరావతి విషయంలోనే అది అమరావతి కాదు గ్రాఫిక్స్ లో చూపించే “భ్రమరావతి” అంటూ కామెంట్స్ వేసేవారు.


ఈ సెప్తాయాంలో ఈ ట్రోల్ల్స్ అన్నిటికీ చెక్ పెడుతూ ఈ రోజు టీడీపీ వారు తమ ట్విట్టర్ ద్వారా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు,తాము చేస్తుంది చేసింది నిజమైన అభివృద్ధి,గ్రాఫిక్స్ కాదు అంటూ చెంపపెట్టులా ఒక వీడియో చేసి పెట్టారు.ఒక సారి ఆ వీడియోలో వారు చేసిన అభివృద్ధి ఎంత వరకు ఉందో మీరూ చూడండి.