రైలు ప్రయాణీకులకు శుభవార్త

SMTV Desk 2019-03-22 11:42:09  train journey, south central railway zone, boarding station, ticket

మార్చ్ 21: రైలు ప్రయాణీకుల కోసం రైల్వే అధికారులు మరిన్ని కొత్త నిబంధనలు తీసుకువస్తున్నారు. ఇకపై బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కోవలసిన అవసరం ఉండదు. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారం ట్రైన్ బయలుదేరడానికి నాలుగు గంటల ముందు వరకు బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. ప్రయాణికులకు ఈ వెసులుబాటు మే 1 నుంచి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ట్రైన్ బయలుదేరడానికి 24 గంటల ముందు వరకే బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే వెసులుబాటు ఉంది. అలాగే బోర్డింగ్ స్టేషన్‌ను రెండు సార్లు మార్చుకోవచ్చు. బోర్డింగ్ స్టేషన్ మార్చుకునేందుకు ప్రయాణికులు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వివరంగా చూస్తే.. A అనే ప్రయాణికుడు కడప నుంచి హైదరాబాద్‌కు రైలు టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే తర్వాత అతను ముద్దనూరుకు బోర్డింగ్ స్టేషన్ మార్చుకున్నాడు. అంటే కడప నుంచి ముద్దనూరు ప్రయాణపు టికెట్ డబ్బులు రిఫండ్ రావు. ఒకవేళ బోర్డింగ్ స్టేషన్ మార్చుకున్న తర్వాత కడప స్టేషన్‌లోనే రైలు ఎక్కాలంటే.. అప్పుడు ఆ బెర్త్ ఖాళీగా ఉంటేనే సాధ్యపడుతుంది. లేకపోతే ప్రయాణించలేం. ఇకపోతే ఆన్‌లైన్‌లో లేదా రైల్వే కౌంటర్‌‌కు వెళ్లి లేదా హెల్ప్ లైన్‌కు కాల్ చేసి బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు.