సీతారాముల కల్యాణ మహోత్సవ పనులు ప్రారంభం

SMTV Desk 2019-03-22 11:39:23  bhadrachalam, seetha rama kalyanam, lord rama, lord seetha

భద్రాచలం, మార్చ్ 21: శ్రీరాముడు సీతాదేవిల కల్యాణ మహోత్సవ పనులకు భద్రాచలం దేవస్థానం అంకురారోపణం నిలిచింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు పవిత్ర గోదావరి నది నుండి అర్చకులు పుణ్య జలాలను తీసుకొచ్చారు. యాగశాలలో రక్షా బంధన, పుట్టమట్టికి పూజ, అంకురారోపణ, అఖండ దీపారాధన, ద్వారతోరణ పూజ, వాస్తుపూజ, వాస్తు బలిహరణం, అంకురారోపణ హవనం, వాస్తు హోమం చేశారు. దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి తాళ్లూరి రమేష్‌బాబు ఆచార్య, బ్రహ్మ, రుత్వికులకు దీక్షా, వస్త్ర, కంకణధారణ గావించారు. భద్రాద్రి రాముడు ఈ రోజు పెళ్లి కొడుకుగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఏప్రిల్14న శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్న నేపధ్యంలో పాల్గుణ పౌర్ణమి హోలీ రోజు తెల్లవారు జామున స్వామివారికి బాలభోగం తరువాత ఉత్సవ మూర్తులను ఉదయం 7గంటలకు బేడా మండపం వద్దకు తీచ్చారు. 25 కలశాలతో అభిషేకం జరిపారు. చిత్రకూట మండపంలో రోలు, రోకలి యందు లక్ష్మీదేవిని, సరస్వతిని ఆవాహన గావిస్తారు. రోకలికి కంకణ దారణ చేస్తారు. శ్రీవైష్ణవ ముత్తైదువులు 9మంది స్త్రీలచే పసుపు కొమ్ములు దంచుట కార్యక్రమం ప్రారంభించారు. 508 గ్రామస్తులచే ముత్యాల తలంబ్రాలు కలుపు తంతు నిర్వస్తున్నారు. అనంతరం స్వామివారిని ఊయలలో వేంచేయింప చేసి లాలలు, జోలలు ఆస్థాన హరిదాసులు పఠిస్తారు.