ఈ ఏడాది ధోనిని మ్యాచ్‌కి అనుగుణంగా ఆడిస్తాం : సీఎస్కే కోచ్

SMTV Desk 2019-03-22 11:36:22  chennai super kings, mahendra singh dhoni, ipl 2019, chennai super kings team coach Stephen pleming

మార్చ్ 21: ఐపీఎల్ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆ టీం హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పలు విషయాలు స్పష్టం చేశారు. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయబోమని, ‘ఐపీఎల్ 2018 సీజన్‌లో మహేంద్రసింగ్ ధోనీ నెం.4 స్థానంలో మెరుగ్గా రాణించాడు. కానీ.. ఈ ఏడాది అతడ్ని మ్యాచ్‌కి అనుగుణంగా ఆడిస్తాం. అలా అని.. అతని బ్యాటింగ్‌ ఆర్డర్‌‌ని పూర్తిగా మార్చేయం. గత 10 నెలలు నుంచి ధోనీ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. మిడిలార్డర్‌లో కేదార్ జాదవ్ ఉండటంతో.. ధోనీపై ఎక్కువ భారం పడకుండా జాగ్రత్త తీసుకుంటాం. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రస్తుతం టీమ్ సంతోషంగా ఉంది’ అని ఫ్లెమింగ్ వెల్లడించాడు. ఐపీఎల్ 2019 సీజన్ శనివారం నుంచి మొదలుకానుండగా.. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొననుంది.