ఐపీఎల్ మొదటి మ్యాచ్...పుల్వామా అమర వీరులకు అంకితం

SMTV Desk 2019-03-22 11:34:27  ipl 2019, royal challengers bengolore, chennai super kings, virat kohli, mahendra singh dhoni, pulawam attack, crpf soldiers

న్యూఢిల్లీ, మార్చ్ 21: మరో రెండు రోజుల్లో ఐపీఎల్ సీజన్ 2019 ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో మొదటి మ్యాచ్ మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు జట్ల మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగనుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి మ్యాచ్‌కు టికెట్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని పుల్వామా ఉగ్రదాడి అమరుల కుటుంబాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 14 న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుడి దాడి జరిపింది. ఈ దాడిలో 41 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. సీఎస్‌కే జట్టు సారథి ధోని చేతుల మీదుగా చెక్కు అంద చేస్తామని ఆ జట్టు డైరెక్టర్ రాకేష్ సింగ్ తెలిపారు.