ఆలియా షాకింగ్ రెమ్యూనరేషన్... ఎంతో తెలుసా ?

SMTV Desk 2019-03-21 17:42:03  rrr, alia bhat

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “RRR”.బాహుబలి సిరీస్ తర్వాత ఇద్దరు అగ్ర నటులతో అందులోను రాజమౌళి దర్శకత్వం అనేసరికి భారీ అంచనాలే నెలకొన్నాయి.ఈ సినిమాకి సంబంధించి కొన్ని కీలక అంశాలను చెప్తూ ఒక ప్రెస్ మీట్ ను కూడా వీరు నిర్వహించి ఈ సినిమాలో తారక్ మరియు చరణ్ ల పాత్రలను గురించి ఒక క్లారిటీ ఇచ్చారు.తారక్ కొమరం భీం పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్ర చేస్తున్నట్టు తెలిపారు.

అయితే ఎన్టీఆర్ కోసం డైసీ ఎడ్గర్ జోన్స్ అనే ఆంగ్ల నటిని రంగంలోకి దింపితే చరణ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను రాజమౌళి దింపుతున్నారు.అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆలియా భట్ ఈ సినిమాకి కళ్ళు చెదిరే రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా ఈమె ఆయన భార్య సీత పాత్ర పోషిస్తున్నారు.అందుకోసం ఈమె దగ్గరకి 12 కోట్లు రెమ్యూనరేషన్ అడిగినట్టు తెలుస్తుంది.ఇది మాత్రం భారీ మొత్తమే అని చెప్పాలి,ఈ వార్త తెలిసిన సినీ వర్గాలు ఇంతా అని ముక్కున వేలేసుకుంటున్నారు.ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.