అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త

SMTV Desk 2019-03-21 17:22:37  Allu arjun,

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి సినిమా తీస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఎప్పుడు లేని విధంగా బన్నీ ఈ సినిమాను చాలా లేట్ గానే మొదలు పెడుతున్నారు, నా పేరు సూర్య సినిమా తర్వాత ఈ సినిమా కోసం బన్నీ సరి కొత్త లుక్ ట్రై చేస్తున్నారు ఇదే సందర్భంలో వచ్చేనెల 8వ తారీఖున అల్లు అర్జున్ పుట్టిన రోజు ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ఆరోజున ఏదో ఒక అప్డేట్ గాని లేదా సాధ్యమైనంతవరకు అల్లు అర్జున్ న్యూ లుక్ రివీల్ చేసేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే గత కొన్నాళ్లుగా అల్లు అర్జున్ ఈ సినిమాలో ప్రతి సినిమాలో ఒక పని చేసే విధంగానే ఈ సినిమా కోసం కూడా కొత్త లుక్ ట్రై చేస్తున్నారు, అందుకు తగ్గట్టుగా ఇప్పటికే బరువు తగ్గి హెయిర్ కూడా బాగా పెంచేసారు. ఈ మధ్య సోషల్ మీడియాలో బయటికి వస్తున్న బన్నీ లేటెస్ట్ క్లిక్స్ కూడా బాగానే వైరల్ అవుతున్నాయి. ఈ అన్ని అంశాలు చూసినట్టయితే బన్నీ పుట్టినరోజున త్రివిక్రమ్ బన్నీతో చేస్తున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసేందుకు అవకాశాలు లేకపోలేదు.మరి బన్నీ పుట్టిన రోజు స్పెషల్ గిఫ్ట్ గా త్రివిక్రమ్ ఏమన్నా గిఫ్ట్ ప్లాన్ చేసారా లేదా అన్నది వేచి చూడాలి.