ఆర్.ఆర్.ఆర్ లో మరో ఇద్దరు స్టార్స్..?

SMTV Desk 2019-03-21 14:04:22  RRR, Rajamouli,

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీ కథ ఇద్దరు రియల్ హీరోస్ కథతో వస్తుందని ఈమధ్యనే రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. తారక్, రాం చరణ్ లతో పాటుగా అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ కూడా ఆర్.ఆర్.ఆర్ లో భాగమవుతారని తెలుస్తుంది.

అజయ్ దేవగన్ తో పాటుగా ఆర్.ఆర్.ఆర్ లో సంజయ్ దత్, వరుణ్ ధావన్ లు కూడా ఈ సినిమాలో నటిస్తారని తెలుస్తుంది. వీరితో రాజమౌళి డిస్కస్ చేస్తున్నారట. త్వరలోనే వీరు నటించే విషయాన్ని అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేశారు.