పేరు మార్చుకుంటే ఫేట్ మారుతుందా..

SMTV Desk 2019-03-21 13:56:52  Sai Dharam Tej, Tej I love you, Chitralahari

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తన పేరుని మార్చుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేస్తున్న సాయి ధరం తేజ్ ఆ సినిమా నుండి మొదటి సింగిల్ పరుగు పరుగు సాంగ్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ క్యాచీగా ఉంది. ఇక ఈ సాంగ్ లో సాయి ధరం తేజ్ కు బదులు సాయి తేజ్ అని పెట్టారు.


తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు వరుసగా 6 ఫ్లాపులు అందుకున్న సాయి ధరం తేజ్ ఈసారి సాయి తేజ్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రలహరి సినిమాలో నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తన పేరును సైతం మార్చేశాడు. ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో అతని స్క్రీన్ నేమ్ సాయి ధరమ్ తేజ్ అని పడేది. చిత్రలహరి లో మాత్రం కేవలం సాయి తేజ్ అని పడుతోంది. లక్ కోసమే ఆయన తన పేరును ట్రిమ్ చేశారనే టాక్ వినపడుతోంది. ఈ కొత్త పేరు సాయి తేజ్ కు ఎలా కలిసొస్తుందో వేచి చూడాలి. ఏప్రిల్ 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నిజంగానే సాయి తేజ్ ను హిట్ ట్రాక్ ఎక్కేలా చేస్తుందో లేదో చూడాలి.