టీకాంగ్రెస్‌కు షాక్...బిజెపిలోకి మాజీ మంత్రి

SMTV Desk 2019-03-21 13:54:55  bjp, trs, congress party, former minister, sunita lakshmareddy

హైదరాబాద్, మార్చ్ 20: తెలంగాణలో కాంగ్రెస్ నుండి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే సగం కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అంతేకాక టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో కాంగ్రెస్ శాసన సభాపక్షం విలీనం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సునీత లక్ష్మారెడ్డి బిజెపిలో చేరనున్నట్టు సమాచారం. బిజెపి తరుఫున ఆమె మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాంగ్రెస్ అగ్ర నేత డికె అరుణ చేరిన విషయం తెలిసిందే. డికె అరుణ మహబూబ్ నగర్ నియోజక వర్గం నుంచి ఎంపిగా పోటీ చేస్తారని సమాచారం. ఇప్పటికే ఎల్‌బి నగర్ ఎంఎల్‌ఎ సుధీర్ రెడ్డి, కొల్లాపూర్ ఎంఎల్‌ఎ హర్షవర్ధన్ రెడ్డి టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.