అక్కినేని వారి పెళ్లి పత్రిక

SMTV Desk 2017-08-10 14:07:58  naga chaythanya, samantha, nagarjuna, amala, lakshmi, sharath

హైదరాబాద్, ఆగస్ట్ 10: టాలీవుడ్ యంగ్ స్టర్స్ అక్కినేని నాగ‌చైత‌న్య, సమంతల పెళ్లి అక్టోబ‌ర్ లో జరుగనున్న విషయం తెలిసిందే. కాగా వీరి పెళ్లి పత్రిక ఫొటో ఒకటి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ పత్రికలో అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ‌, రామానాయుడు, రాజేశ్వరి గార్ల ఆశీస్సులతో నాగ‌చైత‌న్య, స‌మంత‌లు అక్టోబ‌ర్ 6న గోవాలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. అంతేకాకుండా వీరి పెళ్లి జ‌ర‌గ‌బోయే వేదిక కూడా ఆ పత్రికలో ఉంది. ఇది అక్కినేని వారి పత్రిక కనుక దానిలో నాగార్జున, అమ‌ల పేర్లతో పాటుగా నాగచైత‌న్య తల్లి ల‌క్ష్మి, శ‌ర‌త్ పేర్లను కూడా ముద్రించారు.