అఖిల్ తో కియరా అద్వాని

SMTV Desk 2019-03-21 13:47:50  Akhil, Kiar advani

అక్కినేని అఖిల్ చేసిన 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అఖిల్ కు నిరాశనే మిగిల్చింది. ఇక నాల్గవ సినిమా అల్లు అరవింద్ నిర్మాణంలో వస్తుందని తెలుస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందట. బొమ్మరిల్లు, పరుగు సినిమాలతో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న భాస్కర్ ఆ తర్వాత ఒంగోలు గిత్త అని తీసి ఫ్లాప్ అందుకున్నాడు.

తమిళంలో రెండు మూడు ప్రయత్నాలు చేసినా పెద్దగా లాభం లేకపోయింది. అఖిల్ సినిమాతో మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో సత్తా చాటిన కియరా ఇప్పటికే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అఖిల్ తో ఛాన్స్ వస్తే ఆమెకు లక్కీ ఛాన్స్ అన్నట్టే.