అన్నపూర్ణలో ప్రభాస్ 1960 లవ్ స్టోరీ

SMTV Desk 2019-03-21 13:21:47  director radhakrishna, prayanam movie, jil movie, prabhas, saaho, annapurna studios

హైదరాబాద్, మార్చ్ 20: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’తో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే ఇదే సమయంలో దర్శకుడు రాధాకృష్ణ సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డాడు. ‘జిల్’ ప్రయాణం సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణతో ప్రభాస్ ఓ సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యూరప్‌లో కొన్ని కీలక సన్నివేశాలను షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించబోతోంది. అన్నపూర్ణ స్టూడియోలో గురువారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారు. సుమారు 16 రోజుల పాటు ఈ స్టూడియోలో షూటింగ్ జరుగనుంది. ఈ షూటింగ్‌లో ప్రభాస్‌తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే, ఇతర కీలక నటులు కూడా పాల్గొనబోతున్నారు. ప్రేమ కథగా రూపొందుతున్న ఈ చిత్రం 1960 కాలం నాటి నేపథ్యంలో కొనసాగుతుందని తెలిసింది. ఇక మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేశారు.