లండన్‌లో నీరవ్ మోదీ అరెస్ట్

SMTV Desk 2019-03-21 13:15:40  neerav modi, golden visa, Britain government, london high court, arrest warrant

లండన్, మార్చ్ 20: ఇండియాలో వేల కోట్ల అప్పులతో బ్యాంకులను మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని బుధవారం లండన్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని లండన్‌లోని ఓ కోర్టులో హాజరు పరిచారు. అతన్ని ఇండియాకు అప్పగించే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యే అతడు లండన్ వీధుల్లో తిరుగుతూ కెమెరా కంట పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెస్ట్‌మిన్‌స్టర్ కోర్టు అతనికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఈ పీఎన్‌బీ స్కాం బయటపడక ముందే నీరవ్ మోదీ దేశం వదిలి పారిపోయాడు.