టీడీపీకి రాజీనామా చేసిన నామా నాగేశ్వరరావు

SMTV Desk 2019-03-21 13:04:59  nama nageshwar rao, tdp, chandrababu, trs

ఖమ్మం, మార్చ్ 20: మాజీ ఎంపి, తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు మంగళవారం టిడిపికి రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో టిడిపి పూర్వవైభవం కోసం మీతో పాటు నేను అనేక కష్ట నష్టాలకోర్చి రేయింబవళ్ళు కష్టపడినప్పటికీ, తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైన నేపధ్యంలో పార్టీకి రాజీనామా చేయాల్సొస్తుందని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టిడిపి జాతీయ పోలీట్ బ్యూరో పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.