కాంగ్రెస్ ను వీడిన కొల్లాపూర్‌ ఎమ్మెల్యే

SMTV Desk 2019-03-21 12:55:08  kollapur constituency mla, congress party, trs, harshavardhan reddy, kcr, ktr

హైదరాబాద్‌, మార్చ్ 20: కాంగ్రెస్ కు మరో షాక్‌ తగిలింది. త్వరలో టీఆర్‌ఎస్‌ లో చేరబోతున్నట్లు కొల్లాపూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్షవర్థన్‌ రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన లేఖను విడుదల చేశారు. ఈ మేరకు టిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్‌తో బుధవారం సమావేశమయ్యారు. టిఆర్‌ఎస్‌లో ఎప్పుడు చేరతారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ తెరాస లో చేరితే మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్యేల బలం 101కి చేరుతుంది. మరో నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడినట్లయితే అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా పోతుంది. మరోవైపు మరో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమతో చర్చలు జరుపుతున్నారని తెరాస చెబుతోంది.