విమానంలో చెలరేగిన మంటలు...

SMTV Desk 2019-03-21 12:52:49  iran, tehran, mehrabad airport, flight firing, fire accident

టెహ్రాన్‌, మార్చ్ 20: ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో మెహ్రాబాద్‌ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ హాని ఏం జరగలేదు. వివరాల ప్రకారం మెహ్రాబాద్‌ విమానాశ్రయంలో మంగళవారం విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 100మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని సురక్షితంగా కిందకు దించేశారని ఆ దేశ అత్యవసర విభాగం అధిపతి తెలిపారు. ఇరాన్‌ ఎయిర్‌ సంస్థకు చెందిన ఫాకర్‌ 100 విమానంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక కారణాలతో వెనక ల్యాండింగ్‌ గేర్‌ సరైన సమయంలో స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. విమానాశ్రయంలోని అంబులెన్సులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.