మసూద్‌ అజర్‌పై జర్మనీ వేటు

SMTV Desk 2019-03-21 12:48:20  masood azhar, jaish e mohammed, germeny, united nation organisation, international terrorist

జర్మనీ, మార్చ్ 20: ‘ జైష్‌ ఎ మహమ్మద్‌’ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే మసూద్‌ అజర్‌ను ఎట్టి పరిస్తితిలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందే అని యూరోపియన్‌ యూనియన్‌లో జర్మనీ ప్రతిపాదించింది. అజర్‌ను గ్లోబల్‌ టెర్రరిస్టుగా ప్రకటించేందుకు ఈయూ దేశాలతో జర్మనీ సంప్రదింపులు జరుపుతున్నది. ఈ నిర్ణయం వల్ల ఉగ్రవాది అజర్‌పై ఆ దేశాల్లో పర్యటనకు అనుమతిని నిరాకరిస్తారు. 28 ఈయూ దేశాల్లో ఉన్న అతని ఆస్తులు జప్తు చేస్తారు. జర్మనీ ప్రతిపాదన చేసినా, ఇప్పటి వరకు ఎటువంటి తీర్మానం తీసుకోలేదని తెలుస్తుంది.