జనసేన తీర్థం పుచ్చుకున్న నాగబాబు

SMTV Desk 2019-03-21 12:42:18  janasena party, pawan kalyan, nagababu

అమరావతి, మార్చ్ 20: జనసేన పార్టీలోకి తమ్ముడు పవన్‌ సమక్షంలో అన్న నాగబాబు పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతేడాది నాగబాబు జనసేనకు 25 లక్షలు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు ప్రత్యక్షమయ్యారు. దీంతో అప్పటి నుంచి జనసేనలో ఆయన చేరుతారనే ప్రచారం జరుగుతుంది. అయితే నాగబాబు రంగ ప్రవేశంతో నరసాపురం ఎంపి స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పటికే టిడిపి నరసాపురం ఎంపి అభ్యర్థిగా శివ రామరాజును ఆ పార్టీ ప్రకటించింది. వైఎస్‌ఆర్‌సిపి నుంచి ఎంపి అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్టంరాజును బరిలోకి దింపింది.