ఈ సినిమాలపై జోక్యం చేసుకోలేము : హైకోర్టు

SMTV Desk 2019-03-21 12:39:06  lakshmis ntr, lakshmis veeragrantham, high court, ramgopal varma

హైదరాబాద్‌, మార్చ్ 20: సత్యనారాయణ అనే వ్యక్తి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ , ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ సినిమాల విడుదల నిలిపివేయాలని హైకోర్టులో భోజన విరామ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ఎన్నికల సమయంలో విడుదల చేస్తే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు సినిమాల విడుదలలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని తీసినట్లు ఆయన తెలిపారు.