రైనా....ప్రత్యర్థులకి హెచ్చరికలు

SMTV Desk 2019-03-21 12:36:17  suresh raina, ipl, chennai super kings, ipl 2019

న్యూఢిల్లీ, మార్చ్ 20: ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరుపున ఆడుతున్న టీ20 స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా తాజాగా జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మెరుపు అర్థశతకంతో ప్రత్యర్థులకి హెచ్చరికలు పంపాడు. చెపాక్‌ స్టేడియంలో బ్యాటింగ్‌ లయన్స్‌, బౌలింగ్‌ లయన్స్‌ టీమ్స్‌గా విడిపోయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌ ఝుళిపించిన సురేశ్‌ రైనా…కేవలం 29 బంతుల్లోనే ఒక ఫోర్‌, ఆరు సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. స్పిన్నర్‌ కర్ణ్‌శఱ్మ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో రైనా…మూడు సిక్సర్లు బాదడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. అతనితో పాటు మురళీ విజయ్ ను (29బంతుల్లో 2ఫోర్లు, మూడు సిక్సర్లతో 43) దూకుడుగా ఆడాడు. దీంతో…నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు దాదాపు 12వేల మంది అభిమానులు స్టేడియానికి వచ్చినట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తెలిపింది.