హైటెక్ మెట్రో షురూ

SMTV Desk 2019-03-21 12:22:19  hitech city metro, governor narashimhan

హైదరాబాద్‌, మార్చ్ 20: ఈరోజు ఉదయం 9.15 గంటలకు అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొందరు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెట్రో సేవలు ఉదయమే ప్రారంభమయినప్పటికీ ప్రయాణికులను మాత్రం సాయంత్రం 4 గంటల నుంచి అనుమతిస్తామని మెట్రో అధికారులు ఇదివరకే చెప్పారు. మొత్తం 10కి.మీ మార్గంలో అమీర్‌పేట్‌తో కలిపి 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. మధురానగర్‌ స్టేషన్‌కు తరుణి మెట్రో స్టేషన్‌గా నామకరణం చేశారు. పూర్తయిన రెండు కారిడార్లతో కలిపి మొత్తం 56కి.మీ మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ప్రయాణ సమయం ఇలా..

**కారిడార్ 1 : మియాపూర్ నుంచి ఎల్బీనగర్ (29 కిలోమీటర్లు) మెట్రో ప్రయాణంలో 45 నిమిషాలు పడుతుంది. ఇదే ప్రయాణం రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే గంట 46 నిమిషాలు పట్టే అవకాశముంది.

**కారిడార్ 2 : జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు(15 కిలోమీటర్లు) మెట్రో ప్రయాణంలో 22 నిమిషాలు పడుతుంది. ఇదే ప్రయాణం రోడ్డు మార్గంలో గంట 10 నిమిషాలు పడుతుంది.

**కారిడార్ 3 : నాగోల్ నుంచి హైటెక్‌సిటీ (27 కిలోమీటర్లు) మెట్రో ప్రయాణంలో 38 నిమిషాలు పడుతుంది. ఇదే ప్రయాణం రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే గంట 26 నిమిషాలు పడుతుంది.