వాళ్ళు డబ్బు రాజకీయాలు చేస్తారు: టీడీపీ ఎమ్మెల్యే

SMTV Desk 2017-08-10 12:23:42  TDP MLA, Namdyala, By-polls, Shilpa Mohan Reddy, MLA Budda Rajashekhar Reddy

నంద్యాల, ఆగస్ట్ 10: ఈ నెల 23వ తేదీన జరగనున్న్త నంద్యాల ఉపఎన్నికల ప్రచారం జోరందుకుంది. శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అబాండం తండాలో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా వైసీపీకి చెందిన 60 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... శిల్పా సోదరులు కేవలం రాజకీయ స్వార్థంతోనే వైసీపీలోకి వెళ్లారని ఆరోపించారు. వారు డబ్బు రాజకీయాలు చేస్తారు. ప్రజలకు సేవ చేయరు ఒక్క గ్రామంలో కూడా శిల్పా అభివృద్ధి పనులను చేపట్టలేదని విమర్శించారు. నంద్యాల ప్రజలు ఓటుతోనే శిల్పా మోహన్ రెడ్డికి సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.