భారత్‌-పాక్‌ మ్యాచ్‌ భద్రతకు ఎలాంటి ఆందోళన లేదు

SMTV Desk 2019-03-20 13:10:53  icc world cup 2019, india, pakistan, pulwama attack, bcci, icc, icc ceo dev richardson

కరాచి, మార్చ్ 19: భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై ఐసిసి సిఈఓ దేవ్‌ రిచర్డ్‌సన్‌ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రపంచ కప్ లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ భద్రతకు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదని స్పష్టం చేశారు. ప్రపంచకప్‌లో పాల్గొనే అన్నిదేశాలూ ఐసిసి నిబంధనలకు కట్టుబడి ఉంటాయనే సంతకాలు చేశాయని ఆయన తెలిపారు. అలాగే జూన్‌ 16న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ నిర్వహణ, భద్రతా అంశాల్లో తనకెలాంటి అనుమానాలు లేవన్నారు. ఏదైనా కారణం చేత ఏదైనా జట్టు క్రికెట్‌ మ్యాచ్‌ ఆడకపోతే ఆ పాయింట్లు ఇతర జట్టుకి కలిసివస్తాయని చెప్పారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్‌ జవాన్లు మృతిచెందిన నేపథ్యంలో రాబోయే ప్రపంచకప్‌లో పాక్‌తో టీమిండియా మ్యాచ్‌ను నిషేధించాలని వస్తున్న డిమాండ్‌పై ఆయన ఈ విధంగా స్పందించారు.