భీమవరం, గాజువాక స్థానాల నుంచి పవన్ కళ్యాణ్ పోటీ

SMTV Desk 2019-03-20 12:57:53  Pawan Klayan, Janasena,

అమరావతి, మార్చ్ 19: ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగనుంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలకు ధీటుగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ రేస్‌లో నిలుస్తోంది. జనసేన పార్టీ ఏపీలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలతో పాటు తెలంగాణలో కూడా కొన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ నియాజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లాలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసారు. దీంతో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలపై స్పష్టత వచ్చింది. మొదట్లో పవన్ గాజువాక, తిరుపతి నియోజకవర్గాల నుంచి పోటీచేస్తారని ప్రచారం జరిగింది. కానీ భీమవరం నియోజకవర్గం అనూహ్యంగా తెరపైకి వచ్చింది.