రాహుల్ ఎక్కడంటే అక్కడే!

SMTV Desk 2019-03-20 12:35:27  congress party, loksabha elections, digwijay singh, madhyapradesh chief minister, kamalnath

న్యూఢిల్లీ, మార్చ్ 19: ఈ సారి ఎన్నికల్లో దిగ్విజయ్‌ క్లిష్టమైన స్థానాన్ని ఎంచుకోవాలని మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలపై తాజాగ్ ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాహుల్‌ గాంధీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. సవాళ్లను స్వీకిరించడం తనకు అలవాటేనని 1977లో తాను రాఘోగఢ్‌ నుంచి పోటీ చేసి గెలిచాను. రాహుల్‌ గాంధీ ఆదేశించిన స్థానం నుంచి పో టీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఎంత క్లిష్టమైన స్థానం నుంచి పోటీ చేసైనా గెలిచే సామర్థ్యం తనకు ఉందని కమల్‌నాథ్‌ భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దిగ్విజయ్‌ పోటీ చేయాలనుకుంటే రాష్ట్రంలోని క్లిష్టమైన స్థానం ఎంపిక చేసుకోవాలని కమల్‌నాథ్‌ శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత 30-35 సంవత్సరాలుగా గెలవని స్థానాలు కొన్ని ఉన్నాయన్నారు. పరోక్షంగా దిగ్విజయ్‌ను అక్కడి నుంచి పోటీ చేయాలనే సంకేతాలు ఇచ్చారు. భోపాల్‌, ఇండోర్‌, విదిశ లోక్‌సభ స్థానాల్లో గత మూడు దశాబ్దాల్లో కాంగ్రెస్‌ గెలిచిన దాఖలాలు లేవు. ఇండోర్‌ నుంచి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ 1991 నుంచి గెలుస్తూ వస్తున్నారు.