వైసీపీకి వెళ్లకుండా ఆనం కి చంద్రబాబు తాయిలాలు

SMTV Desk 2017-08-09 18:59:33  AP CM, Nellore chandrababu naidu, Chief minister, TDP, Anam ramanarayana reddy

నెల్లూరు, ఆగస్ట్ 9: నంద్యాల ఉపఎన్నికల నేపధ్యంలో శిల్పా సోదరులు తెదేపా విడిచి వైకాపాకి వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే ఇటివల కాలంలో నెల్లూరు జిల్లాలో కీలక నేతలైన ఆనం రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారన్న ఆరోపణల తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేగంగా స్పందించినట్లు తెలుస్తుంది. వీరిద్దరూ ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో పదవులు లభించకపోవడంతో నిరాశ చెందారని, దీంతో పార్టీ మారే అవకాశం ఉందని జిల్లాలో ప్రచారం జోరందుకుంది. దీంతో వారిద్దరూ చేజారకుండా ఉండడం ముఖ్యమని భావించిన చంద్రబాబు వారికి తన కలల ప్రాజెక్టు అప్పగించనున్నట్టు సమాచారం. ఆనం రామనారాయణ రెడ్డికి చంద్రన్న బీమా, హౌసింగ్ ప్రాజెక్టులు భాద్యతలు ఇచ్చి వారు పార్టీ మారకుండా, పదవి కోరకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం.