కాశ్మీర్ యువకుడికి శౌర్య చక్ర అవార్డు

SMTV Desk 2019-03-19 15:40:18  ram nath kovind, president of india, Shaurya Chakra award, Irfan Ramzan Sheikh of Jammu & Kashmir,

న్యూఢిల్లీ, మార్చ్ 19: మంగళవారం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన ఇర్ఫాన్ రంజాన్ షేక్‌కు రాష్ట్రపతి శౌర్య చక్ర అవార్డును ప్రదానం చేశారు. 2017లో జ‌మ్మూక‌శ్మీర్‌లో ఓ ఇంటిపై ఉగ్ర‌వాదులు దాడి చేశారు. ఈ దాడిని అడ్డుకోవడంలో సైన్యానికి ఇర్ఫాన్ ఎంతగానో సహకరించాడు. ఈ ఘటన జరిగినప్పుడు ఇర్ఫాన్ వయస్సు కేవలం 14 ఏళ్లే. అంత చిన్న వయస్సులోనే ఇర్ఫాన్ చూపిన ధైర్య సహాసాలకు గాను ఆయన్ను శౌర్య చక్ర అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఇర్ఫాన్ కు ఈ అవార్డు రావడంపై పలువురు అభినందనలు తెలిపారు. జ‌మ్మూక‌శ్మీర్‌ యువత ఇర్ఫాన్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి పేర్కొన్నారు.