స్టామినా అఫ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్

SMTV Desk 2019-03-19 13:43:01  Mega Power Star, Ram charan Tej

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన సినిమాల్లో ఒక ప్లాప్ సినిమాని ఇష్టపడని వారు మాత్రం ఎవరు ఉండరని చెప్పడంలో ఎలాంటి అతిశెయోక్తి లేదని చెప్పొచ్చు.అదే భాస్కర్ దర్శకత్వంలో చరణ్ సరసన జెనీలియా హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం “ఆరెంజ్”.2010లో విడుదలైన సినిమా పై చరణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.అలాగే అంతకు ముందు విడుదలైన మగధీరతో అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు తారుమారు చెయ్యడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కానీ అప్పటి జెనరేషన్ కన్నా కాస్త అడ్వాన్సుడ్ గా ఈ సినిమాని తియ్యడంతో ఎవరికీ అంతగా ఎక్కలేదు.దీనితో ఈ సినిమా ఘోర పరాజయం చూడాల్సొచ్చింది.అయితేనేం బుల్లితెరపై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోడమే కాకుండా ఇప్పుడు హిందీ ప్రేక్షుకుల మనసులు కూడా కొల్లగొట్టి 100 మిలియన్ క్లబ్ లోకి ఈ సినిమా చేరిపోయింది.ఈ సినిమాను “రామ్ కి జంగ్” అనే పేరుతో హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో వదలగా హిందీ ప్రేక్షకులకు కూడా అమితంగా నచ్చేసినట్టుంది అందుకే ఈ సినిమాని 100 మిలియన్ మంది చూసేసి రామ్ చరణ్ ప్లాప్ సినిమాకు సరికొత్త రికార్డును అందించారు.మరి ఈ సినిమాను ఇంకెంత మంది చూస్తారో చూడాలి.