భారీ ఆఫర్ వదులుకున్న ఎన్టీఆర్

SMTV Desk 2019-03-19 12:51:50  ntr, big boss,

రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ మూడవ సీజన్ కు సిద్ధమవుతుంది. రెండవ సీజన్ జరిగిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే సీజన్ 3 జరుగుతుందట. బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మొదటి సీజన్ హోస్ట్ గా చేసిన ఎన్.టి.ఆర్ తారక్ ససేమీరా అంటున్నాడట. మూడవ సీజన్ కు వస్తాడని అన్నారు కాని బిగ్ బాస్ చేసేందుకు ఎన్.టి.ఆర్ ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదట. భారీ పారితోషికం ఇస్తామని చెప్పినా సరే

ఇందుకు కారణం ఆర్.ఆర్.ఆర్ సినిమా అని అంటున్నారు. రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ సినిమాకు 10 నెలలు డేట్స్ ఇద్దరు ఇచ్చేశారు. షూటింగ్ టైంలో ఎలాంటి లీక్స్ లేకుండా ఉండాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న కారణంగా సినిమాలో అతని లుక్ ఎలా ఉంటుందో తెలియకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. సో ఈ సీజన్ ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ హోస్ట్ గా చూడటం కష్టమే.. మరి ఈసారి హోస్ట్ గా ఎవరు చేస్తారో చూడాలి.