ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన కేంద్రం

SMTV Desk 2017-08-09 18:39:22  AP Govt, Central Govt, Revenue, New delhi

అమరావతి, ఆగస్ట్ 9: గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 2014-15 బడ్జెట్ లో రూ. 16 వేల కోట్లను రెవెన్యూ లోటుగా వచ్చిందని, ఆ నిధులను కేంద్రం భరించాలని రెండున్నరేళ్లుగా కోరుతూనే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ ఏపీకి లోటు కేవలం రూ. 4,117.89 కోట్లేనని తేల్చింది. కాగా, ఇప్పటికే రూ. 2,303 కోట్లను ఇచ్చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడుతున్న నిధులను లోటులో భాగం చేసేది లేదని కూడా కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా రావాల్సిన నిధులను మంజూరు చేస్తామని తెలిపింది. దీంతో లోటు బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా కేంద్ర నిర్ణయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.