విశాఖ టిడిపి ఎంపీ అభ్యర్థిగా బాలకృష్ణ చిన్నల్లుడు!

SMTV Desk 2019-03-19 12:06:22  sribharath, balakrishna, mla, tdp, vishkha loksabha constituency, mp ganta srinivasa rao

విశాఖపట్నం, మార్చ్ 18: బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌ను విశాఖ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా ఎంపిక చేయాలనే ఆలోచనలో జిల్లాలోని మెజారిటీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా నేడు మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో విశాఖ లోక్‌సభ నియోజకవర్గ స్థానం నుంచి అభ్యర్ధి ఎంపికను ఖరారు చేసేందుకు విశాఖజిల్లా టిడిపి నేతలు, మ్మెల్యేలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం గంటా మీడియాతో మాట్లాడుతూ..విశాఖ లోక్‌సభ స్థానానికి భరత్‌ ఆసక్తిగా ఉన్న అంశాన్ని సియంకు తెలిపామన్నారు. ఈ స్థానంలో అభ్యర్ధి ఎవరనే దానిపై నిర్ణయం త్వరలో వెలువడే అవకాశం ఉందన్నారు. దీనిపై తుది నిర్ణయం సియం చంద్రబాబు తీసుకుంటారని గంటా అన్నారు.