ప్రియాంకా గాంధీ జలయాత్ర ప్రారంభం

SMTV Desk 2019-03-19 11:53:50  priyanka gandhi, congress party, Priyanka Gandhi Vadra at Triveni Sangam,Ganga-yatra, Chhatnag, Prayagraj Varanasi

లక్నో, మార్చ్ 18: త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌ లో గంగా ప్రచార యాత్రను ప్రారంభించారు. ప్రయాగరాజ్ నుంచి వారణాసి వరకు మూడు రోజులపాటు 140 కిలోమీటర్ల వరకు పడవలో ప్రచారం నిర్వహించనున్నారు. బస్సు, రైలు, పాదయాత్రలే కాకుండా నదిలో యాత్ర చేపట్టిన ప్రియాంకగాంధీ వినూత్న ప్రచారం చేస్తున్నారు. నదీ తీర గ్రామాల్లో సాగుతున్న ప్రియాంక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు.