వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు బీసీసీఐ భారీ విరాళం

SMTV Desk 2019-03-19 11:41:31  Pulwama attack, Bharath Surgical strike, Airforec india, Pakistan Terrorists, Indian army, Pakistan president, Imran khan, bcci, indian navy

న్యూఢిల్లీ, మార్చ్ 18: జమ్ముకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో వీర మరణం పొందిన భారత సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు బీసీసీఐ అండగా నిలిచింది. ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా రూ.20 కోట్లు విరాళంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆర్మీ, వాయుసేన, నావికాదళం సీనియర్‌ అధికారులను ఆహ్వానించి ఈ మొత్తాన్ని వారికి అందించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇక పుల్వామా దాడి నేపథ్యంలో ఐపీఎల్‌ సెరమినిని రద్దు చేసిన బీసీసీఐ.. ఇందుకయ్యే మొత్తం వ్యయాన్ని సైనిక కుటుంబాలకు అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. పుల్వామా ఘటన పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం సైనిక కుటుంబాలకు విరాళాలు ఇచ్చారు. మరికొన్ని స్వచ్చంధ సంస్థలు ప్రాణాలు కోల్పోయిన జవాన్ల పిల్లలను చదివిస్తామంటూ ముందుకొచ్చాయి.