త్రివిక్రం.. అల్లు అర్జున్.. ఓ అబద్ధపు ప్రపంచం..

SMTV Desk 2019-03-18 18:30:12  Trivikram, Allu arjun,

మాటల మాంత్రికుడు త్రివిక్రం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి చేస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత బన్ని, త్రివిక్రం కలిసి చేస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ లైన్ చెక్కర్లు కొడుతుంది. ఇది ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగే కథ అని తెలుస్తుంది.

తండ్రి కోసం హీరో అబద్ధం ఆడుతాడట. అయితే ఆ అబద్ధం వల్ల విలన్ ఎఫెక్ట్ అవడం.. అలా విలన్ హీరోని టార్గెట్ చేయడం జరుగుతుందట. అయితే హీరో చెప్పిన అబద్ధం చివరకు నిజమని తెలుస్తుందట. ఇదే కథతో త్రివిక్రం, బన్ని సినిమా వస్తుందట. అంటే త్రివిక్రం, అల్లు అర్జున్ కలిసి ఓ అబద్ధపు ప్రపంచాన్ని సృష్టిస్తారన్న మాట. ఏప్రిల్ 1న సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.