ప్రేక్షకులకు బంపర్ ఆఫర్

SMTV Desk 2019-03-18 18:23:48  RRR, Rajamouli.

హైదరాబాద్‌, మార్చ్ 18: టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్, ల కాంబినేషన్లో దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక మల్టీ స్టారర్ RRR సినిమా యూనిట్ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే సినిమా టైటిల్ డిసైడ్ చేసే అవకాశం ప్రేక్షకులకు కల్పించింది. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో దర్శకుడు రాజమౌళి చెప్పినట్టుగానే ఈ సినిమా వర్కింగ్ టైటిల్ RRR కు అబ్రివేషన్ తో ఉన్న టైటిల్ ను చెప్పండంటూ సినిమా యూనిట్ ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనలో తెలిపింది.

యూనిట్ ఇలా పోస్ట్ చేయటమే ఆలస్యం, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, ల పేర్లు కలిసి వచ్చేలా ప్రేక్షకులు టైటిల్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమా 1920ల కాలం నాటి స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో సాగే కథతో ఉండబోతోందన్న సంగతి తెలిసిందే, ఈ సినిమా భారీ బడ్జెట్ తో మల్టీ లింగువల్ గా రూపొందనుందని నిర్మాత దానయ్య ఇది వరకే తెలిపారు. తెలుగు సహా ఇతర భాషల్లో RRR వర్కింగ్ టైటిల్ తోనే ఈ సినిమా రూపొందనుందని, ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ తో ఉండనుందని తెలిపారు.