లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఈ నెలలోనే విడుదల

SMTV Desk 2019-03-18 17:44:13  Lakshmis NTR, Ram Gopal Varma,

హైదరాబాద్, మార్చ్ 18: ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ సృష్టించిన వివాదాల గురించి తెలిసిందే, అయితే ఈ సినిమా విడుదలకు దగ్గర పడటంతో టీడీపీ సినిమాను విడుదల కాకుండా ఆపాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మొదట విడుదలను ఆపాలంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయగా సినిమా విడుదలను అడ్డుకోలేమంటూ ఎన్నికల కమిషన్ తేల్చేసింది, ఆ తర్వాత సెన్సార్ బోర్డు రంగంలోకి దిగింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను సెన్సార్ కు పంపగా, రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ సినిమా విడుదలైతే రాజకీయపరంగా అభ్యంతరాలు, విమర్శలు వచ్చే అవకాశం ఉందని, ఎన్నికల తర్వాత రిలీజ్ చేయాలని తెలిపింది సెన్సార్ బోర్డు.

సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా వర్మ కోర్ట్ను ఆశ్రయించి సినిమా విడుదలకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు, సెన్సార్ బోర్డు సినిమా రిలీజ్ కు అవసరమైన ప్రాసెస్ ను కూడా మొదలు పెట్టినట్లు వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ క్రమంలో అన్నీ అనుకూలిస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఈ నెల 29కి విడుదల అవుతుందని సమాచారం అందుతుంది.