మాజీ ప్రేమికుల దారుణ హత్య!!!

SMTV Desk 2017-08-09 15:46:15  Srikakulam, Murder, Ex-lovers,

శ్రీకాకుళం, ఆగస్ట్ 9: శ్రీకాకుళం జిల్లా గారమండలంలోని కొమరివానిపేటలో పెను విషాదం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కామేశ్వరరావు, దివ్య గాయత్రి అనే ఇద్దరు మాజీ ప్రేమికులు హత్యకు గురయ్యారు. వీరిద్దరి పెళ్లికి పెద్దలు అనుమతించకపోవడంతో వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. కాగా, పెళ్లయిన తర్వాత కూడా వీరు ప్రేమ బంధాన్ని వదులుకోలేకపోయారు. ఇద్దరూ తరచూ కలుసుకునే వారని సమాచారం. అయితే ఈ జంట హత్యల వెనుక దివ్య గాయత్రి బంధువుల హస్తం ఉండి ఉంటుందని పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. సంఘటనా స్థలంలోని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.