“మహర్షి” సూపర్ అప్ డేట్

SMTV Desk 2019-03-18 12:12:26  Mahesh babu, Maharshi,

హైదరాబాద్, మార్చి 18: ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాంచి ఆకలి మీదున్నారు..మహేష్ ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో “మహర్షి” అనే సందేశాత్మక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ వస్తే చాలు రికార్డ్స్ అన్ని షేక్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని మహేష్ అభిమానులు అంటున్నారు.కానీ ఈ సినిమా నిర్మాణ సంస్థ మాత్రం ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోగా కనీసం ఇచ్చే ప్రకటన కూడా ఇవ్వడం లేదు.దీనితో మహేష్ అభిమానులు మాత్రం చాలా నిరాశలోనే ఉన్నారు.

ఇంకా ఏ అప్డేట్ కి సంబందించిన విషయం బయటకి రాకపోయినా గాసిప్స్ మాత్రం బాగానే వస్తున్నాయి.ఇప్పుడు తాజాగా ఈ సినిమా తాలూకా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు డేట్ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది.ఇంకా టీజరే ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పలేదు.అప్పుడే ప్రీ రిలీజ్ వరకు వెళ్లిపోయారా అన్న సందేహం కూడా వస్తుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వచ్చే నెల 20 వ తేదీన నిర్వహించాలని చిత్ర యూనిట్ అనుకుంటుందని సమాచారం.ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే 9 న విడుదల కానుంది.