రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు... పరిస్థితి విషమం!

SMTV Desk 2019-03-18 09:24:29  anchor rashmi, jabardasth anchor, rashmi gautam

హైదరాబాద్, మార్చి 18: ప్రముఖ యాంకర్, నటి రష్మి చిక్కుల్లో పడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ పాదచారిని ఢీకొనగా, అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెంలో జరిగింది. ఇటీవల రష్మి ఓ కొత్త కారు కొనుక్కుంది. ఆమె దానిలో వెళుతున్న వేళ, ప్రమాదవశాత్తూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొంది. ఈ ఘటన రాత్రి 11 గంటల సమయంలో జరుగగా, గాయపడిన వ్యక్తిని దగ్గరలోనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి పంపినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసు కేసు నమోదైందా? లేదా? అన్న విషయం తెలియాల్సివుంది.