సెన్సార్‌ బోర్డుపై కేసు పెడతా: వర్మ

SMTV Desk 2019-03-17 15:28:51  Lakshmis NTR, RGV,

హైదరాబాద్, మార్చ్ 17: సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ నెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఏపీలో ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల చేయడం సబబు కాదని తెదేపా కార్యకర్త దేవిబాబు చౌదరి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో సినిమాను ప్రస్తుతానికి నిలిపివేయాలంటూ సెన్సార్‌బోర్డు చిత్రబృందాన్ని ఆదేశించింది. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది.

ఈ నేపథ్యంలో తాజాగా ట్విటర్‌ ద్వారా వర్మ స్పందిస్తూ.. సెన్సార్‌ బోర్డుపై కేసు పెడతానని, సినిమా విడుదల కోసం న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. త్వరలో కడపలో ఓ బహిరంగ సభలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఆడియో వేడుకను నిర్వహించనున్నట్లు వర్మ శనివారం వెల్లడించిన విషయం తెలిసిందే.