స్పీడ్ పెంచిన సమంత

SMTV Desk 2019-03-17 15:24:24  O baby, Samantha,

హైదరాబాద్, మార్చి 17:పెళ్లి తర్వాత స్పీడ్ పెంచిన సమంత.. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈమె చేస్తున్న తాజా సినిమాల్లో ‘ఓ బేబీ’ చిత్రం ఒకటి. ‘ఎంత సక్కగున్నావే’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కొరియన్‌ చిత్రం ‘మిస్‌ గ్రానీ’ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో సమంత యువతి గాను, వృద్ధురాలి గాను రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా సమంత తన సినీ జర్నీని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగడానికి కాస్త సమయం పట్టింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా. ప్రస్తుతం నా ఎదుగుదలతో చాలా సంతృత్తిగా ఉన్నా. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన దేవుడు, వ్యక్తుల పట్ల కృతజ్ఞురాలిగా ఉంటా’’ అని పోస్ట్‌లో పేర్కొంది సామ్.