పోల్లచి సెక్స్ రాకెట్.. యువతికి 25 లక్షల పరిహారం: హైకోర్టు

SMTV Desk 2019-03-17 11:20:06  polachi sex racket,

తమిళనాడు, మార్చ్ 16: తమిళనాడులోని పొల్లాచిలో ఇటీవల బయటకు వచ్చిన సెక్స్ రాకెట్ సంచలనం సృష్టిస్తోంది. అధికార పార్టీ నేతలు కూడా ఇందులో ఉండడంతో తీవ్ర నిరసనలు పెల్లుబుకుతున్నాయి. పొల్లాచ్చికి చెందిన నలుగురు యువకులు గ్యాంగ్‌గా ఏర్పడి సోషల్ మీడియాలో అమ్మాయిలకు వల వేశారు. సోషల్ మీడియాలో పరిచయమైన అమ్మాయిలతో సాన్నిహిత్యం పెంచుకొని వారిపై అత్యాచారానికి పాల్పడేవారు. అమ్మాయిలను అత్యాచారం చేస్తున్న దృశ్యాలను కెమెరాలో బందించి, సదరు అమ్మాయిల కుటుంబ సభ్యులకు చూపించి, వారి నుంచి భారీగా డబ్బులు రాబట్టారు. అలా ఆ గ్యాంగ్ వందల్లో అమ్మాయిలను అత్యాచారాలు చేసి కోట్లల్లో డబ్బులు రాబట్టింది.

ఎట్టకేలకు ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ గ్యాంగ్ దుర్మార్గాలు వెలుగులోకి వచ్చాయి. కానీ పొల్లాచ్చి అత్యాచారాల కేసును సీబీఐకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో అత్యాచారాలకు పాల్పడిన యువకుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ యువతి పేరు, చిరునామాను ప్రచురించడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పొల్లాచ్చి అత్యాచారాలు వెలుగులోకి రావడానికి కారణమైన యువతికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది.