ఐర్లాండ్‌లో ట్రంప్ పర్యటన

SMTV Desk 2019-03-16 17:40:25  irland, america, donald trump, Leo Varadkar

ఐర్లాండ్/డుబ్లిన్, మార్చ్ 16: ఐర్లాండ్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటించారు. ఈ సందర్భంగా ట్రంప్, ఐర్లాండ్‌ ప్రధాని లియో వరద్కార్‌ ఇద్దరూ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే తమ లక్ష్యమని ఇరు దేశాధినేతలు ఉద్ఘాటించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, సరిహద్దులో భద్రతా ప్రమాణాల పెంపు తదితర అంశాలపై సుదీర్ఘ మంతనాలు జరిపారు. అనంతరం భేటీకి సంబంధించిన వివరాలను వైట్‌హౌస్‌ కార్యాలయం వెల్లడించింది. ఈ నెల 29 లోపు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలగాల్సి ఉంది. బ్రెగ్జిట్‌ అనంతరం ఏ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాలనే అంశంపై సుదీర్ఘ చర్చ కొనసాగింది.