ఇక ఆన్‌లైన్‌లో చేనేత వస్త్రాలు : అమెజాన్

SMTV Desk 2017-08-08 18:57:03  AMEZON, HANDLOOMS, ONLINE SHOPPING, KTR

హైదరాబాద్, ఆగస్ట్ 8 : చేనేత కార్మికులకు తమ వంతు సహాయం అందించడానికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీ ముందుకొచ్చింది. ఆన్ లైన్ ద్వారా చేనేత వస్త్రాలను విక్రయి౦చడానికి తెలంగాణ ప్రభుత్వంతో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన "వోవెన్ 2017" ప్రదర్శనలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అమెజాన్ ప్రతినిధులు ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. ఈ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. "ఈ భాగస్వామ్యం ఇలాగే కొనసాగాలని, చేనేత వస్త్రాలను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం" అంటూ వెల్లడించారు.