ఎద్దును గోమాతను చేసేసారు గా .. ట్విట్టర్ లో బీజేపీ కౌంటర్

SMTV Desk 2019-03-16 15:01:26  bjp, TDP,

అమరావతి , మార్చ్ 16: ఎన్నికల తేదీలు దగ్గరపడుతున్న వేళ సోషల్‌ మీడియా వేదికగా రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.తమ పార్టీకి చెందిన ప్రచారంతో పాటు ప్రత్యర్థి పార్టీలు చేసే తప్పిదాలని ఎత్తిచూపుతున్నాయి.తాజాగా టీడీపీకి చెందిన ఎన్నికల ప్రచార ప్రకటనపై బీజేపీ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వివరాల్లోకి వెళ్తే టీడీపీ తన ఎన్నికల ప్రచార ప్రకటన కోసం ఎద్దును ఏకంగా గోమాతను చేసేశారని బీజేపీ ఎద్దేవా చేసింది.

సీఎం చంద్రబాబు వల్ల తాను గోమాతను కొనుగోలు చేసినట్టు ఓ మహిళ చెబుతున్నట్టు రూపొందించిన టీడీపీ ప్రచార ప్రకటనలో.. గోమాత స్థానంలో ఎద్దు ఉండటాన్ని బీజేపీ శుక్రవారం ట్విట్టర్‌లో ఎద్దేవా చేసింది.దీనికి సంబంధించిన ఫొటోను పోస్ట్‌ చేసింది.రోజూ టీడీపీ తప్పులు చూపించలేక మేమూ విసిగిపోతున్నామంటూ పేర్కొంది.