గంభీర్, సునిల్ ఛెత్రి కి పద్మశ్రీ

SMTV Desk 2019-03-16 14:57:55  goutam gambhir, sunil chetri, indian cricketer, indian football player, padmashri award, president of india, ramnath kovind

న్యూఢిల్లీ, మార్చ్ 16: శనివారం ఢిల్లీలో ప‌ద్మా అవార్డుల‌ను రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌దానం చేశారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరానికి గాను మొత్తం 112 మందిని ఎంపిక చేశారు. ఈ నెల 11వ తేదీన 47 మందికి అవార్డులు అందజేశారు. మిగతావారికి శనివారం రాష్ట్రపతి భవన్‌లో అవార్డులను అందజేయనున్నారు. భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునిల్ ఛెత్రి కి పద్మశ్రీ అవార్డు లభించింది. అలాగే జానపద గాయని తీజన్ బాయి (పద్మవిభూషణ్), ఇస్రో శాస్తవేత్త నంబి నారాయణ్ (పద్మభూషణ్), మహాశయ్ ధరంపాల్ గులాటి (పద్మభూషణ్), పర్యతారోహకురాలు బచెంద్రిపాల్ (పద్మభూషణ్), ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (పద్మశ్రీ), స్వపన్ చౌధురి(పద్మశ్రీ), ఆర్చర్ బంబాయ్‌లా దేవి లైశ్రయ్ (పద్మశ్రీ), హెచ్ ఎస్ ఫూల్కా (పద్మశ్రీ) లభించింది.