చంద్రబాబు, లోకేశ్ లే కుట్రకు బాధ్యులు

SMTV Desk 2019-03-16 13:48:00  NAra lokesh, AP CM chandra Babu Naidu,

వైసీపీ అధినేత జ‌గన్ మోహ‌న్ రెడ్డిని మాన‌సికంగా దెబ్బ‌తీయ‌డానికే .. వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హ‌త్య చేయించార‌ని వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌డ‌ప జిల్లాలో అశేష ప్ర‌జాభిమ‌నం క‌ల్గి, అజాత‌శ‌తృవుగా పేరుగాంచిన వివేకానంద‌రెడ్డి, టీడీపీ శ్రేణుల గెలుపుకు అడ్డుగా ఉన్నార‌ని, అందుకే వివేకానంద‌రెడ్డిని దారుణంగా న‌రికి చంపార‌ని విజ‌య‌సాయి రెడ్డి ఆరోప‌ణ‌లు చేశారు.

క‌డ‌ప‌లో టీడీపీ ప‌ట్టు సాధించాలంటే వివేకానంద‌రెడ్డి ఉండ‌గా క‌ష్ట‌మ‌ని భావించిన టీడీపీ నేత‌లు ఆయ‌న్ని భౌతికంగా లేకుండా చేయాల‌ని ప్లాన్ వేసి వివేకానంద‌రెడ్డిని హ‌త‌మార్చార‌ని విజ‌య‌సాయిరెడ్డి మండి ప‌డ్డారు. ఇక వివేకా హత్య కుట్ర‌కు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లే బాధ్యుల‌ని విజ‌య‌సాయి రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రి విజ‌య‌సాయి రెడ్డి వ్యాఖ్య‌ల పై టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.