దినేశ్‌ కార్తీక్‌ వరల్డ్ కప్ లో ఆడాతాడు!

SMTV Desk 2019-03-16 13:45:01  icc world cup 2019, team india, dinesh kartik, Kolkata Knight Riders, coach simon cutich

సిడ్నీ, మార్చ్ 16: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహాయ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ దినేశ్‌ కార్తీక్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో జరగనున్న ఐపీఎల్ సీజన్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న దినేశ్‌ కార్తీక్‌ ఎంపికవుతాడని ధీమా వ్యక్తం చేశాడు. కార్తీక్‌ ఒక మంచి ఫినిషర్‌గా పేరుతెచ్చుకోవడం అతనికి కలిసి వస్తుందన్నాడు. అతనికి డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడం చాలా కష్టమన్నాడు. ఇటీవల కాలంలో భారత జట్టు తరుపున అతడు మ్యాచ్‌లు ముగించిన తీరు అతన్ని ప్రపంచకప్‌ రేసులో నిలుపుతుందన్నాడు. అతడు ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడు. ప్రతిభావంతులు చాలా మంది ఉండటంతో భారత సెలెక్టర్లకు జట్టును ఎంపిక చేయడం కష్టమవుతుంది. దాంతో అతని ఎంపిక దాదాపు ఖాయమేఅని కటిచ్‌ పేర్కొన్నాడు.