మసీదుల్లో కాల్పులు : దుండగుడు హైకోర్టులో హాజారు

SMTV Desk 2019-03-16 13:44:12  newzealand, central christchurch, masjeed, gun firing, 6men died, Christchurch mosque shooting, social media, facebook, you tube, facebook live streaming, high court

వెల్లింగ్టన్‌, మార్చ్ 16: నిన్న ఉదయం న్యూజిలాండ్‌ లొనీ రెండు మసీదుల్లో దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ దుండగుడు బ్రెంటన్‌ టారంట్‌ను ఈరోజు కోర్టులో హాజరుపరచారు. మసీదుల్లో సృష్టించిన మారణహోమానికిగాను అతడిపై హత్యారోపణల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు బెయిల్‌కు అభ్యర్థించకపోవడంతో విచారణ నిమిత్తం ఏప్రిల్‌ 5వరకు రిమాండ్‌ విధించారు. ఖైదీ దుస్తులు, చేతులకు బేడీలు వేసి పటిష్ఠ భద్రత మధ్య నిందితుడిని పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. అతడిని దారుణంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు కోర్టు ముందు నినాదాలు చేశారు.